calender_icon.png 19 January, 2026 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతకాని వర్గానికి మేడారం ట్రస్ట్ బోర్డులో సముచిత గౌరవం దక్కింది

19-01-2026 12:00:00 AM

నేతకాని సామాజిక వర్గానికి చోటు కల్పించడంపై హర్షం

సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా మార్షల్ దుర్గం నగేష్,నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి ఈశ్వర్

ములుగు,జనవరి18(విజయక్రాంతి): ఆదివాసీల కుంభమేళాగా పేరుగాంచిన మేడా రం సమ్మక్క-సారలమ్మ జాతర ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ల కమిటీలో నేతకాని(నైతకాని)సామాజిక వర్గానికి చోటు కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నేతకాని వర్గానికి చెందిన జనగం గంగలక్ష్మిని ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మంత్రి సీతక్కకు నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి ఈశ్వర్,సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. మార్షల్ దుర్గం నగేష్ కృతజ్ఞతలు తెలిపారు.ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తూ మేడారం జాతరలో సంప్రదాయబద్ధ సేవలందిస్తున్న నేతకాని వర్గానికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని డా. నగేష్ చేసిన డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

ఆచారాల ప్రకారం వారు సమర్పించే ‘సారె చీర’కు అధికారిక గుర్తింపు ఇవ్వాలన్న విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకుంది.శనివారం మేడారం గ్రామంలో మంత్రి సీతక్క సమక్షంలో గంగలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా డా. దుర్గం నాగేష్, జాడి ఈశ్వర్ మాట్లాడుతూ కాకతీయుల కాలం నుంచే ఆదివాసీలతో కలిసి జీవిస్తున్న నేతకాని వర్గానికి ఈ నియామకం చారిత్రక గౌరవమని, ఇది సామాజిక న్యాయానికి నిదర్శనమని అన్నారు..గంగలక్ష్మి నియామకం తో తెలంగాణ వ్యాప్తంగా నేతకాని వర్గాల్లో సంబరాలు వెల్లివిరిశాయి. కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ నాయకులు ఎండి. అఫ్సర్ పాషా, జాడి రాంబాబు తదితరులు ఆమెను ఘనంగా సన్మానించారు. 2026 మేడారం జాతరలో నేతకాని వర్గ సంప్రదాయాలకు మరింత అధికారిక గుర్తింపు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.