19-12-2025 01:19:29 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా తన జాతీయ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై అక్రమ కేసులతో వేధించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ కేంద్ర ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో గురువారం బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు.
బీజేపీ కార్యాలయంలో నికి చేర్చుకునేందుకు యత్నించగా కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకో వడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. చివరకు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి, మావల పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్బంగా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబ గౌరవాన్ని తగ్గించడం కోసం గాంధీ కుటుంబంపై నేషనల్ హెరాల్డ్ పేరుతో అక్రమ కేసులు పెట్టి గత పది సంవత్సరాలుగా వేదించె ప్రయత్నం చేస్తోందన్నారు.
మోడీ ప్రభుత్వం పరిపాలించడం చేత కాక ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఈడి, సీబీఐ వంటి సంస్థల ని ఉపయోగించి ప్రతిపక్షాలని అణచి వేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టు కేంద్ర ప్రభుత్వానికి చివాట్లు పెట్టడంతో కేంద్ర ప్రభుత్వం కుట్ర బైటపడిందన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపు రావు, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ముడుపు దామోదర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చరణ్ గౌడ్, నాయకులు గుడిపెల్లి నగేష్, అర్ఫాత్ ఖాన్, వేముల నాగరాజు, నహీద్ తదితరులు పాల్గొన్నారు.