calender_icon.png 19 December, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ కుటుంబంపై కక్ష ఎందుకు?

19-12-2025 01:21:01 AM

  1. బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. అడ్డుకున్న పోలీసులు 

పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ నేతల నినాదాలు..

వైఖరి మార్చుకోవాలని కాంగ్రెస్ నేతల డిమాండ్ 

నిర్మల్, డిసెంబర్ 1౮ (విజయక్రాంతి): అఖిలభారత కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు గురు వారం నిర్మల్ లో డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన బిజెపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత దారి తీసింది. దేశంలో అధికారులు ఉన్న మోడీ ప్రభుత్వం తమ నాయకులైన సోనియా గాంధీ రాహుల్‌గాంధీపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని మార్చి జి రామ్ జి పేరును జోడించడంపై కాంగ్రెస్ పార్టీ బిజెపి కార్యాలయం ముట్టడించేందుకు పెద్ద సంఖ్య లో తరలి వెళ్లారు.

మొదట నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన ఎమ్మెల్యే వేడుమ బుజ్జి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ కార్యాలయం ముట్టడించేందుకు తరలి వెళ్లారు. అప్పటికి అక్కడ ఉన్న బిజెపి నేతలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇరు వర్గాల మధ్య పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ దూసుకురావడంతో వందమంది పోలీసు బలగాలతో భారీకేర్లు ఏర్పాటు చేసి ఇరు వర్గాలను శాంతింప చేశారు. కాంగ్రెస్ నేతలు భారికేట్లు దాటి బిజెపి కార్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది తాము శాంతియుతంగా నిరసన తెలిపితే బిజెపి నేతలు తమకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంపై ఎమ్మెల్యే బుజ్జి పటేల్ మాజీ మంత్రి ఇంద్రకన్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జున్ అలీ తీవ్రంగా మండిపడ్డారు.

దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీ కుటుంబం పై బిజెపి ప్రభుత్వం కక్ష పెంచుకొని అక్రమ కేసులను బనాయి ఇచ్చి పేద ప్రభుత్వ పథకాలను దేవుళ్ళ పేరుతో మార్చడం సరికాదని డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బుజ్జి పటేల్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. బిజెపి తమ ఎన్నికల స్వార్థం కోసం జాతి నేతల పేర్లను మార్చడం సిగ్గుచేటు అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తే మోడీ ప్రభుత్వం దాన్ని నిర్విజన్ చేసినందుకు కుట్ర పండుతుందని ఆరోపించారు. సంపన్నులపై ఉన్న ప్రేమ మోడీకి సామాన్యులపై లేదని కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల వర్గాల అభివృద్ధి కోసం మరోసారి ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి అబ్దుల్ ఆది కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి రెడ్డి రాజశేఖర్ రెడ్డి వెంబడి రాజేశ్వర్ ధర్మాజీ రాజేందర్ నాందేడ్ చిన్ను సమరసింహారెడ్డి జుమైత్ దుర్గాభవాని తదితరులు ఉన్నారు.