ఆదివాసీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడాలి...
- తెలంగాణ రాష్ట్రంలోని ఫారెస్ట్ భూముల సమస్య పరిష్కారానికి కేంద్రం కృషి చేయాలి..
- గోండుల జాతీయ మహాసభలో మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఉట్నూర్, జూలై 19 ( విజయక్రాంతి ): దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో జీవనం సాగిస్తు న్న ఆదివాసి గోండు గిరిజనులను అన్ని రం గాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభు త్వం తోడ్పాటు అందించాలని మాజీ ఎంపీ, తెలంగాణ రాజ్ గోండు సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు డిమాండ్ చేశారు. చత్తీస్గడ్ రాష్ట్రంలోని రాయపూర్ లో ఆదివారం ఏర్పాటు చేసిన గొండ్వాన గోండు మహాసభలో పాల్గొన్నారు. ఈ స భకు జాతీయ అధ్యక్షుడు శిశు పాల్ సారీ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆదివాసీలను ఉద్దేశించి మాట్లాడుతూ... దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జీవనం సాగిస్తున్న ఆదివాసుల స్థితిగతుల తో పాటు సమస్యలను పరిష్కరించుటకు కృషి చేయాలన్నారు.
విద్యా ఉద్యో గాలు, పరిశ్రమలు , భూ సమస్యను పరిష్కరించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలు నిరుద్యోగ సమస్యతో తల్లడిల్లి పోతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసుల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించుటకు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అడవి శాఖ అధికారులు పోడు చేసుకునే గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవె న్యూ అడవి శాఖ అధికారులు సంయుక్తంగా యుద్ధ ప్రాతిపదికన సర్వేలు చేసి భూ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్సెంగా తానాజీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పేందూర్ మాధవ్ ల తో పాటు రాజ్ గోండు సేవాసమితి జిల్లా రాష్ట్ర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మహాసభలో ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ మహాసభకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జీవిస్తున్న ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.






