విద్యను వ్యాపారంగా మార్చిన కేంద్రం
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
సికింద్రాబాద్,జూలై15 (విజయ క్రాంతి): విద్యను వ్యాపారంగా మార్చిన కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.సికింద్రాబాద్ బోయినపల్లి లో నిర్వహించిన ఛత్రోం కి గూంజ్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి కన్వీనర్, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెం కట్,సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు దీపక్ జాన్.
స్థానిక ఎమ్మెల్యే,కార్పొరేషన్ చైర్మ న్లు,మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి హాజరయ్యారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వ్యాపారంగా మార్చిందని తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగ, విద్యా పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.నీట్ సహా పలు జాతీయ స్థాయి పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీలు దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసాన్ని దెబ్బతీశా యని అన్నారు.
ఇన్ని ఆరోపణలు, ఆధారా లు వెలుగులోకి వచ్చినప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయకపోవడం దురదృష్టకరమని, ఆయనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత బాధాకరమని విమర్శించారు.విద్యార్థుల హక్కులను కాపాడేందుకు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికే లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ దేశవ్యాప్తం గా ఛత్రోంకి గూంజ్ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.
ఈ ఉద్యమంలో ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు భాగస్వామి కావాలని పిలుపు నిచ్చారు.నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.
దేశ విద్యా వ్యవస్థను రక్షించేందుకు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు జరుగుతున్న ఈ ఉద్యమానికి విద్యార్థులు,యువత పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






