13-07-2025 12:09:06 AM
డీకే శివకుమార్
బెంగళూరు, జూలై 12: కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై రాజకీయం రోజురోజుకు కాక రేపుతోంది. ఐదేళ్లూ నేనే ముఖ్యమంత్రినంటూ ఓ వైపు ప్రస్తు త సీఎం బల్లగుద్ది చెబుతుండగా.. ‘ఆశ పడటంలో తప్పలేదు కదా’ అంటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం పీఠంపై తన ఆసక్తిని వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో డీకే తాజాగా చేసిన వ్యా ఖ్యలు మరింత చర్చకు తావిస్తున్నాయి.
కుర్చీ దొరికితే వదలొద్దంటూ అధికార పీఠంపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. డీకే మా ట్లాడుతూ.. ‘ఇక్కడ చాలా మంది న్యాయవాదులు సీట్లు ఖాళీగా ఉన్నా వాటిలో కూర్చోవడం లేదు. కానీ, మేమందరం మాత్రం ఓ కూర్చీ కోసం తీవ్రం పోరాటం చేస్తాం. కుర్చీ సంపాదించడం అంత సులువు కాదు. దొరికితే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు’ అని డీకే పేర్కొన్నారు.