calender_icon.png 18 November, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రిజర్వేషన్ల సాధనలో ముఖ్యమంత్రి వైఖరి స్పష్టం చేయాలి

18-11-2025 12:48:13 AM

బీసీ జాక్ చైర్మన్ తిరునహరి శేషు  

హన్మకొండ, నవంబర్ 17 (విజయ క్రాంతి):స్థానిక సంస్థలలో బీసీలకి 42 శాతం రిజర్వేషన్ల సాధనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రోడ్ మ్యాప్ ని స్పష్టం చేయాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శే షు డిమాండ్ చేశారు.

హరిత కాకతీయ హోటల్ లో బీసీ రిజర్వేషన్ల కి సంబంధించి ముఖ్యమంత్రి కి లేఖ విడుదల చేసిన సందర్భంగా డాక్టర్ శేషు మాట్లాడుతూ స్థానిక సంస్థలలో బీసీలకి 42 శాతం రిజర్వేషన్ల కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లు, సవరణ బిల్లు, జీవో లాంటి అన్ని ప్రయత్నాలు విఫలమైనందు వలన రిజర్వేషన్ల సాధనకి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్ర త్యామ్నాయ మార్గాలను బలహీన వర్గాలకి తెలియజేయాలని డిమాండ్ చేశారు.

రిజర్వేషన్ల సాధనకు ఎదురవుతున్న అడ్డంకులను వాటిని అధిగమించటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను, కేంద్ర ప్రభుత్వ సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను ముఖ్యమంత్రికి లేఖ ద్వారా తెలియజే స్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేసినప్పుడే రిజర్వేషన్లు సాధించగలుగుతాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల సాధనకి కేంద్రంతో సంప్రదింపులు ప్రారంభించాలని కోరారు.

డిసెంబర్ 1 నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి రిజ ర్వేషన్ల సాధనకి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తటంతో పాటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రైవేట్ బిల్లు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లతో పాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన అన్ని హామీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలి అలాగే సంచార జాతుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కి లేఖలో విజ్ఞప్తి చేశారు.

బీహార్ ఎన్నికలలో ఈబీసీ ఓట్లతో బిజెపి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాయి కాబ ట్టి స్థానిక సంస్థలలో బీసీలకి 42 శాతం రిజర్వేషన్లు కల్పనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి రిజర్వేషన్లు సాధించాలని అభిప్రాయ వ్యక్తం చేశారు.

రిజర్వేషన్ల సాధనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయటం ద్వారా రిజర్వేషన్లు సాధించగలుగుతామని,చట్టబద్ధమైన రిజర్వేషన్లు సా ధించకుండా స్థానిక సంస్థలలో బీసీలకి పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయటమంటే మరొకసారి బీసీలను మోసం చేసినట్లుగానే భావించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు దారబోయిన సతీష్, నూతన కంటి ఆనందం, బుట్టి శ్యామ్ యాదవ్, ఎదునూరి రాజమౌళి, సోమిడి అంజన్ రావు, చిన్నాల యశ్వంత్ యాదవ్, డాక్టర్ పాలడుగుల సు రేందర్, దాడబోయిన శ్రీనివాస్, డాక్టర్ రమేష్, కేడల ప్రసాద్, ధర్మపురి రామారావు, వేణు చారి, వినయ్ చారి, డేనియల్, కుమార్ గాడ్గే, విజయ్ కుమార్, కృష్ణ కుమా ర్, మల్లేశం, అనిల్, వంగపండ్ల నరేందర్ తదితరులుపాల్గొన్నారు.