calender_icon.png 18 November, 2025 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నియోపొలిస్ ఫేజ్ ప్రీ

18-11-2025 12:48:57 AM

-హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సమావేశం

-భారీగా హాజరైన డెవలపర్స్, పెట్టుబడిదారులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): కోకాపేట గోల్డెన్ మైల్ రోడ్‌లోని ప్రముఖ భూభాగం సహా రాబోయే ఈబ్రౌవేలంపై చర్చించేందుకు టీహబ్‌లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సోమవారం నియో పొలిస్ ఫేజ్ ప్రీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి 100 మందికి పైగా డెవలపర్స్, పెట్టుబడిదారులు, సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

సర్ఫరాజ్ అహ్మద్, మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్‌ఎండీఏ, జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, ఎస్టేట్ ఆఫీసర్ ఆర్. ఉపేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ రవీందర్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ సుదర్శన్, ఈఈ అప్పారావు, డిప్యూటీ ఈఈ రవీందర్ హాజరయ్యారు. కంప్లయన్స్ నిబంధనలు, జోనింగ్ ప్రావిజన్స్, చెల్లింపులు, ఎంకంబ్రెన్సులు, ఇతర నియంత్రణ విషయాలపై స్పష్టతనిచ్చారు.

మెట్రోపా లిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ స్థిరమైన బాహ్య పరిస్థితులు, బలమైన మౌలికసదుపాయాలు, వేగవంతమైన కోస్మోపాలిటన్ వృద్ధి వంటి ప్రత్యేకతలను వివరించారు. ఎంఎస్‌టీసీ లిమిటెడ్ ఈ్రఆక్షన్ రిజిస్ట్రేషన్ దశలు, ప్రాసెస్ ఫ్లో, కంప్లయన్స్ అవసరాలపై వివరించారు. జోన ల్ మేనేజర్ జామిల్ అఖ్తర్ ఆన్‌లైన్ బిడ్డింగ్ విధానం, పోర్టల్ ఫంక్షనలిటీలు, ఈ ఆక్షన్‌లో పాల్గొనే సమయంలో అనుసరించాల్సిన విధానాలను వివరించారు.

రాబోయే నాలుగు రో జుల ఈ ఆక్షన్‌కు ప్రతిరోజూ రెండు ప్లాట్లు వేలానికి వస్తుండటంతో అనేక మంది తమ బిడ్డింగ్ వ్యూహాలను సిద్ధం చేయడం ప్రారంభించారు. గోద్రేజ్, సత్త్వ, మై హోమ్, బ్రిగేడ్, జీహెచ్‌ఆర్, మేఘా ఇంజినీరింగ్, ఎంఎస్‌ఎన్ సహా అనేక ప్రముఖ జాతీయప్రాంతీయ అభివృద్ధి సంస్థలు, మౌలిక సదుపాయ కంపెనీ లు, ఫార్మా ప్రతినిధులు హాజరయ్యారు.