16 April, 2026 | 11:25 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ట్యాపింగ్ పేరుతో రాజకీయ వేధింపులు

01-02-2026 01:45 AM

బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

సిద్దిపేట, జనవరి 31 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతుందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద ఆయన శనివారం మీడి యాతో మాట్లాడారు. టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో గత రెండేళ్లుగా బీఆర్‌ఎస్‌పై ధారావాహిక సీరియల్ తరహాలో వేధింపులు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం  నాటకాలకు తెరలేపారన్నారు. కాంగ్రెస్ నేతలు అలీబాబా 40 దొంగలు, దండుపాళ్యాం ముఠా తరహాలో అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు.  బొగ్గు స్కాం,  భూ స్కాం వంటి పెద్ద స్కాంల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ట్యాపి ంగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ నాయకుల గొంతు నొక్కేందుకే సిట్ పేరిట కుట్రలని ఆయన ఆరోపించారు.