10 June, 2026 | 2:55 AM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఎం వ్యాఖ్యలు తగవు

10-06-2026 12:20 AM

బీజేపీ జిల్లా కార్యదర్శి కృష్ణ గౌడ్

చేవెళ్ల, జూన్ 9 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావని బీజేపీ జిల్లా కార్యదర్శి గౌండ్ల కృష్ణ గౌడ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థి దశనుండి ఒకే సిద్ధాంతం అంకితభావంతో పనిచేసిన మచ్చలేని నాయకుడు కిషన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సిఎం హోదాకు తగదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నా రనడం అసత్యమన్నారు.

గత పన్నెండు సంవత్సరాలుగా కేంద్రం రాష్టానికి ఇచ్చిన నిధులు, ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, రైల్వేలు, విద్యాసంస్థలు, అభివృద్ధి వివరాలను కిషన్ రెడ్డి ప్రజల ముందుంచారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ అవినీతిపై ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక రాజీ పడిందని ఆరోపించారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకు నేందుకు బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తోందని ద్వాజమెత్తరు.

రైతులకు, నిరుద్యోగ యువతకు, మహిళలకు ప్రకటించిన పథకాల వాగ్దానాలను అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కాంగ్రెస్‌బీఆర్‌ఎస్ రాజకీయ కుమ్మక్కు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలకు తగిన సమయంలో ప్రజలే సమాధానం చెబుతారని గౌండ్ల కృష్ణ గౌడ్ పేర్కొన్నారు.