ముందు పాపను కాపాడుకుందాం.. నేనున్నా..!
ఖమ్మం ఘోరంపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆవేదన
ఖమ్మం జూన్ ౮ : ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యా యత్నం ఘటనపై తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం తలదించు కునేలా ప్రవర్తించిన ఆ కఠినాత్ముడిని చట్ట పరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఆ యన స్పష్టం చేశారు. తల్లంపాడు గ్రామానికి చెందిన రేగళ్ల రమేశ్ కుమార్తెపై జరిగిన ఈ ఘాతుకం తనను తీవ్రంగా కలచివేసిందని, నిందితుడిపై తక్షణమే కఠిన చట్టాల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదే శించారు.
బాధితులకు పూర్తి అండ..
విషయం తెలిసిన వెంటనే మంత్రి పొం గులేటి బాధిత బాలిక తండ్రితో, స్థానిక సర్పంచ్తో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. ‘ముందు మన పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి.. నేను న్నా‘ అని ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం తక్షణమే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పాప వైద్య ఖర్చుల న్నింటినీ తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి పొంగులేటి భరోసానిచ్చారు.






