కూలిన వంతెన
08-04-2026 01:32 AM
- హిమాచల్‌ప్రదేశ్‌లో ఘటన
కొండచరియలు విరిగిపడటమే కారణం
సిమ్లా, ఏప్రిల్ 7: కొండచరియలు విరిగిపడడంతో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లా భర్మౌర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హోలీ గ్రామాల మధ్య ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ గ్రామాల ప్రజలకు రవాణాలో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో వంతెనను నిర్మించాలని పలుమార్లు ప్రభుత్వానికి నివేదించారు. రూ. 5 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు.
80 ఏళ్ల తరువాత ఈ ప్రాంతంలో వంతెన నిర్మిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో ఈ ప్రాంతంలో చిన్నపాటి కర్రలతో చేసిన ప్రమాదకరమైన వంతెన ఉండేది. గతమూడేళ్లుగా నూతన వంతెన నిర్మాణం కొనసాగుతుండగా, దాదాపుగా పూర్తయ్యే దశకు చేరుకుంది. ఈ లోపే కొండచరియల ధాటికి కూలిపోయింది.




