ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పులు
08-04-2026 01:31 AM
- ఇస్తాంబుల్‌లో ఘటన
భద్రత దళాల కాల్పుల్లో ముగ్గురు దుండగులు హతం
ఇస్తాంబుల్, ఏప్రిల్ 7: తుర్కియే రాజధాని ఇస్తాంబుల్‌ంలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద మంగళవారం కాల్పులు కలకలం రేపాయి. ముగ్గురు దుండగులు సాయుధంగా కారులో వచ్చారు. కారు దిగి కాన్సులేట్‌పై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రత సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా, ముగ్గురు దుండగులూ మరణించారు. కాల్పుల సమయంలో ఇద్దరు భద్రతా సిబ్బంది క్షతగాత్రులయ్యారు.
కాన్సులేట్‌పై దాడిని ఘటనను తుర్కియే, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు ఉగ్రదాడిగా అభివర్ణించాయి. దుండగులు ఇస్తాంబుల్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని ఇజ్మిత్ నగరం నుంచి వచ్చినట్లు తుర్కియే అంతర్గత వ్యవహారాల మంత్రి ముస్తఫా సిఫ్ట్సీ వెల్లడించారు.




