7 April, 2026 | 3:22 PM

Breaking News

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోవ లక్ష్మి   •   ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దు   •   కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య   •   కేంద్రం కీలక నిర్ణయం.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు   •   ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలి   •  

కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

14-05-2024 02:01 AM

మంత్రి సీతక్క

జయశంకర్ భూపాలపల్లి (ములుగు), మే 13 (విజయక్రాంతి): కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ధీమా వ్యక్తం చేశారు. తన స్వగ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేటలో సోమవారం ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి మార్పు కోరుకున్నారో, అదే రీతిలో దేశ ప్రజలు కూడా మార్పు దిశగా ఆలోచిస్తున్నారని అన్నారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలకు గుణపాఠం తప్పదని పేర్కొన్నారు.