21 June, 2026 | 9:45 PM

రాజ్యాంగాన్ని సామాన్యులే కాపాడుకుంటున్నారు

16-06-2024 12:54 AM
  • ‘భారత రాజ్యాంగ పీఠిక’ పుస్తకావిష్కరణలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (విజయక్రాంతి): దేశంలో రాజ్యాంగానికి ప్రమాదం సంభవిస్తున్న ప్రతిసారి సామాన్యులే కాపాడుకుంటున్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్, ప్రఖ్యాత న్యాయ నిపుణుడు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ రచించిన ‘భారత రాజ్యాంగ పీఠిక’ పుస్తకావిష్కరణ శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్టు కే రామచంద్రమూర్తి అధ్యక్షత వహించగా, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరామ్, ఎమ్మెస్కో పబ్లిషర్స్ అధినేత విజ య్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత సమాజం ఊపిరి ఆగిపోయే స్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నట్టుగా ఉందనిపిస్తుందన్నారు. రాజ్యాం గంలో పొందుపర్చిన ఆదేశిక సూత్రాలతో పాటు సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ, గణతంత్ర విలువలు ప్రజలందరికీ సమానంగా దక్కాలన్నారు.  ప్రముఖ సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్‌పై ఉపా కేసు నమోదు చేయడం సరికాదని పేర్కొన్నారు.