21 June, 2026 | 10:53 PM

వంధత్వం పరిష్కారానికి ‘ఆండ్రోమాక్స్’

16-06-2024 12:50 AM

ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో 2 కేంద్రాలు ప్రారంభం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (విజయక్రాంతి): పురుషులలో వంధత్వ సమ స్య పరిష్కారానికి ‘ఆండ్రోమాక్స్’ను ప్రారంభించామని ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్, సీఈవో వినేశ్ గాధియా తెలిపారు. ఇంటర్నేషనల్ ఫాదర్స్‌డే సందర్భం గా ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో తిరుపతి, రాజమండ్రిలో కేంద్రాలను ప్రారంభిం చినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ప్రముఖ నటి సంగీత సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వినేశ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. తమ సంస్థ సేవల ను ప్రారంభించడం ద్వారా తల్లిదండ్రులుగా మారాలనుకునే వారికి మద్దతు ఇస్తామని చెప్పారు.

పురుషుల కోసం సంతానోత్పత్తి ఫలితాలను మెరుగుపరచగలమన్నారు. ఫెర్టీ 9 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి బుడి మాట్లాడుతూ ‘ఆండ్రోమాక్స్’ను ప్రారంభించడం ద్వారా అత్యున్నత స్థాయి వైద్య నైపుణ్యం, సాంకేతికతతో చికిత్స అందిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని జంట లకు అసాధారణమైన సేవలను అందిస్తున్న ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ చేస్తున్న సేవలను ప్రముఖ నటి సంగీత అభినందించారు. 2 కొత్త బ్రాంచిలను ప్రారంభించడం పట్ల ప్రశంసలు తెలిపారు. కొత్త కేంద్రాల ప్రారంభోత్సవం సందర్భంగా ఐవీఎఫ్ విధానాలపై 25 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ బాధ్యులు తెలిపారు.