నమ్మితే నట్టేట ముంచారు!
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (విజయక్రాంతి): ఉద్యోగులను నమ్మడమే ఆ సంస్థ చేసిన తప్పేమో! నమ్మకంతో మెదిలితే నట్టేటా ముంచారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఇస్తారా పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్లోర్ మేనేజర్లుగా పని చేస్తున్న ఇద్దరు కేటుగాళ్లు, తమ సంస్థ పేరిట నకిలీ క్యూ ఆర్ కోడ్‌లు ఏర్పాటు చేసి రూ. 4.15 కోట్లు తమ వ్యక్తి గత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఈ క్రమంలో ఉద్యో గం చేస్తూ మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అదుపులోకి తీసు కున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్తా రా పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, నగరంలోని కొండాపూర్ కేంద్రంగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. ఈ సంస్థ దేశంలోని 16 ప్రధాన నగరాల్లో ఫుడ్ కోర్టుల ను ఏర్పాటు చేసింది. అలాగే హాస్పిటాలిటీ రంగంలో నూ సేవలు అందిస్తుంది. ఇస్తాలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు కంపెనీ క్యూ ఆర్ కోడ్‌లకు బదులుగా నకిలీ క్యూ ఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారని సంస్థ నిర్వాహ కులు గుర్తించారు. దీంతో కంపెనీకి రూ. 4.15కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తించిన ఇస్తారా ఎండీ ఇర్షాద్ హుస్సేన్ సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించారు.
నిందితులను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇస్తారా సంస్థ చెంగిచెర్లలో ఫ్లోర్ మేనేజర్‌గా పనిచేస్తున్న యాసిరెడ్డి అనిల్ కుమార్(41), సికింద్రా బాద్ ఇస్తారా ఫ్లోర్ మేనేజర్ రాజ్‌కుమార్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 2023 మార్చి నుంచి ఇస్తారా పార్క్స్ సంస్థలో ఫ్లోర్ మేనేజర్‌గా ఉన్న నిందితుడు యాసిరెడ్డి అనిల్‌కుమార్, నగరంలోని వెర్వేరు బ్రాంచ్‌లలో కంపెనీ క్యూఆర్ కోడ్ స్థానంలో నకిలీ క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేసినట్లు అంగీకరించాడు.
తాను రూ. 2కోట్ల మోసం చేశానని, ఇందుకు సహకరిం చిన తన సహోద్యోగులకు రూ. 70లక్షలు చెల్లించనని, రూ. 40లక్షలతో ఫ్లాట్ కొనుగోలు చేశానని, రూ. 60 లక్షల చిట్టీ కడుతున్నానని, మిగతాది తన వ్యక్తిగత అవస రాల నిమిత్తం వాడుకు న్నానని ప్రాథమిక విచార ణలో అంగీకరించాడు. ఏ2 రాజ్‌కుమార్ రూ. 10లక్షలు తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఖర్చు చేశానని ఒప్పుకున్నాడు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.






