రాష్ట్ర సమగ్రాభివృద్ధ్దే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
- గట్టిగా వీచే గాలులకు కదులుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు...
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎద్దేవ...
- జిల్లాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ఆదిలాబాద్, జూన్ 2 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ల క్ష్యంగా ప్రజా పాలన ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో గుడిసెలు లేకుండా ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పక్కా ఇంటి నిర్మాణం చేపడతామని జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి స్వ యంగా ప్రకటించడం చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పై ఆయన ప్రత్యేక దృష్టి సా రించడం జరిగిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరిగిన అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులతో కలిసి స్థానికఅమరవీరుల స్థూపానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివా ళులర్పించారు.
ఉద్యమ సమయంలో అమరులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో పలువురు జిల్లా ఉ న్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మహ్మద్ షబ్బీర్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. వేడుకలను పురస్కరించుకుని రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచా యతీ పరిధిలోని పలువురు లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను అందించారు.
మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పురోగతిని సాధించడంలో కృషి చేసిన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రసంశా పత్రాలను అందజేశారు. స్వయం ఉపాధి కోసం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక పునరావాస పథకంలో భా గంగా ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు ఒక్కొక్కరికి రూ. 75 వేల రూపాయల చొప్పున చెక్కులను పంపిణి చేశారు. నూతన మీసేవా కేం ద్రాల నిర్వహణకు ఎంపికైన ఐదుగురికి మీ సేవా కేంద్రాల మంజూరి పత్రాలను అందజేశారు.
సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 13 మం ది దివ్యాంగులకు సుమారు 7 లక్షల రూపాయల విలువ చేసే ఉపకరణాలను ఉచితంగా పంపిణి చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రుణాల చె క్కులను అందచేశారు.అనంతరం కలెక్టర్ స మావేశ మందిరంలో సిఏం-కప్ విజేతలను సన్మానించి, ప్రోత్సాహకంగా రూ. 10 వేల రూపాయలను ప్రభుత్వ విప్ అందజేశారు. తెలంగాణగా రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి మహ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ... ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అన్ని రంగాల్లో దశదిశలా వెలుగులు విరజిమ్ముతోందని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాం క్షలకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, ప్రజ లు కోరుకున్న మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బా ధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రజా సంక్షేమమే ముం దుకు సాగుతోందని స్పష్టం చేశారు.
అభివృద్దే లక్ష్యంగా మార్చ్ ఆరు నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజా పాలన ప్రగ తి ప్రణాళికను ఒక బృహత్తర యజ్ఞంలా చే పట్టినట్లు వెల్లడించారు. ఇందు లో భాగంగా మార్చ్ 6న అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించి, అనేక అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్.చిత్రు, ఎస్.రాజేశ్వర్, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, ము న్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, మా ర్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డిజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






