కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు
బోథ్.జూన్ 2: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బలిదానాలు 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరాహార దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్య మైందని బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్. పే ర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన. కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణత్యాగం ఉందన్నారు వేలాదిమంది ప్రజలు ఉద్యమంలో పాల్గొని పార్టీలకు అతీతంగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగిందన్నారు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన బిడ్డ లాగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించారన్నారు
అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందు ఉంచుతూ రైతు సాగునీరు సంక్షేమం విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన దేశానికి రోల్ మోడల్ గా నిలిచారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి రైతులను మోసం చేస్తూ సస్యశ్యామలమైన తెలంగాణను 50 సంవత్సరాలు వెనక్కి పంపారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ కన్వీన ర్ నారాయణరెడ్డి సర్పంచుల సంఘం మా జీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ మాజీ ఏఎంసీ చైర్మన్ రుకుమన్సింగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎలు క రాజు పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్ర శాంత్ యూత్ అధ్యక్షుడు మేడి చల్మా ప్రవీ ణ్ గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ రమణ గౌడ్ కోటబి గ్రామ సర్పంచ్ స్వామి బాబు రెడ్డి సాగర్ రెడ్డి గంగమల్లు సోమేశ్ వి డి సి చైర్మన్ అల్లకొండ పోతన్న రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






