30 August, 2026 | 2:06 AM

కాంగ్రెస్‌వి విభజన రాజకీయాలు

30-08-2026 12:58 AM
  1. మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూస్తుంది 
  2. కేంద్ర సంక్షేమ ఫలాల్లో 22 నుంచి 37 శాతం లబ్ధిదారులు మైనారిటీలే
  3. వందేమాతరం దేశభక్తికి ప్రతీక
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

మహబూబ్‌నగర్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): కాంగ్రెస్ విభజన రాజకీయాలు చే స్తోందని, మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షు డు ఎన్ రాంచందర్‌రావు ఆరోపించారు. భా రతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, ఎన్ని కులాలు,

మతాలు ఉన్నా మనమందరం భారతీయులుగా ఐక్యంగా జీవిం చడమే ఈ దేశ గొప్పతనమని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించిన బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, దిశానిర్దేశం చేశారు. ఈ సంద ర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ..

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుం టూ సమాజంలో విభజన రాజకీయాలు చే సిందని మండిపడ్డారు. దేశంలో అత్యధిక మత ఘర్షణలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, వారి హయాంలోనే జరిగాయని చారిత్రక వాస్తవాలను గుర్తుచేశారు.

వాజ్‌పేయి హయాం నుంచి నేటి నరేంద్ర మోదీ12 ఏళ్ల పాలన వరకు బీజేపీ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడుతూ, ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ అనే నినాదంతో ముందుకు సాగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ముద్రా, జన్‌ధన్, ఉజ్వల, ఉడాన్ వంటి ప్రతి సంక్షేమ పథకంలో 22 శాతం నుంచి 37 శాతం వరకు లబ్ధిదారులు మైనారిటీ వర్గాల వారే ఉండ టం మోదీ ప్రభుత్వ సమన్యాయ పాలనకు నిదర్శనమన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం పై కాంగ్రెస్ పార్టీ కల్పించిన అపోహలను రాంచందర్‌రావు తీవ్రంగా ఖండించారు. నిజాం నిరంకుశ పాలనపై హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో జర్నలిస్ట్ షో యబుల్లా ఖాన్ వంటి దేశభక్తులు సైతం ‘వందేమాతరం’ నినదిస్తూ ప్రాణాలర్పించారని గుర్తుచేశారు.

వందేమాతరం ఏ మతా నికీ వ్యతిరేకం కాదని, అది పవిత్రమైన భరతమాతను గౌరవించే జాతీయ గేయమని పేర్కొన్నారు. 1937లో ముస్లిం లీగ్‌కు భయపడి మొదటి రెండు చరణాలకే పరిమితం చేసిన కాంగ్రెస్, నేడు కేరళంలో జమాతే ఇ స్లామీ, తెలంగాణలో మజ్లిస్ పార్టీల ఓటు బ్యాంకుకు భయపడి వందేమాతరాన్ని వ్యతిరేకిస్తూ దేశభక్తిని అవమానిస్తోందని ధ్వజమె త్తారు. మోదీ ప్రభుత్వంలో మాత్రమే మైనారిటీలకు నిజమైన రక్షణ, విద్య, ఉద్యోగ, సం క్షేమ రంగాల్లో సమాన అవకాశాలు అందుతున్నాయని తెలిపారు. 

ఈ వాస్తవాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని మైనారిటీ మోర్చా శ్రేణులకు రాంచందర్‌రావు పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని రామచందర్‌రావు  తీవ్రంగా విమర్శించారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరే షన్ చైర్మన్‌కు కార్లు,

గన్‌మెన్లు, కా ర్యాలయాలు ఇవ్వడానికే పరిమితమయ్యారని, మైనారిటీల అభివృద్ధికి మాత్రం ఒక్క రూపాయి నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. మైనారిటీ గురుకులాలు, హాస్టళ్లు సరైన వసతులు లేక అధ్వాన స్థితికి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రం ఓట్ల కోసమే మైనారిటీల పేరును వాడుకుంటోందని స్పష్టం చేశారు. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కుమ్మక్కై మజ్లిస్ అభ్యర్థిని గెలిపించాయని ఆయన గుర్తుచేశారు.

నేడు అదే మజ్లిస్ ఎమ్మెల్సీ ఒక మైనర్‌పై లైంగిక దాడి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంటే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎందుకు నోరు మెదప డం లేదని, వారి మధ్య ఉన్న అంతర్గత ఒప్పందం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మాయమాటలను నమ్మవద్దని, తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.