భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- ప్రొ.హరగోపాల్
- విరసం సభకు అనుమతి నిరాకరణపై ప్రజా సంఘాల నేతల ఖండన
ముషీరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగాల్సిన విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భావ దినోత్సవ సభ ను అడ్డుకోవడాన్ని వివిధ ప్రజాసంఘాల నాయకులు ఖండించారు. ఈ మేరకు అదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడా రు. ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ సభను అడ్డుకోవడం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని, కేంద్ర ప్రభుత్వ మెప్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
విర సం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ మాట్లాడు తూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కీలుబొమ్మగా మారిందని, విప్లవ, ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేయడమే లక్ష్యం గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విరసం కార్యదర్శి రివేరా మాట్లాడుతూ సభకు అనుమతి నిరాకరించడం, హాల్ యాజమాన్యా న్ని బెదిరించడం రాజ్యాంగ విరుద్ధ చర్యలేనని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వీక్షణం సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ ఫాసిజానికి వ్యతిరేకంగా నిర్వహించదలిచిన సభను అడ్డుకోవడం ఆశ్చర్యకరం కాదన్నారు. 1970లో మహాకవి శ్రీశ్రీ, కొడవటి గంటి కుటుంబరావు తదితరులతో ఏర్పడిన విరసం సభకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సమావేశంలో అరసం నేతలు కుమారస్వామి పాల్గొన్నారు.






