జీపీ కార్మికుడి కుటుంబానికి చేయూత
06-07-2026 12:50 AM
మహబూబాబాద్, జూలై 5 (విజయక్రాంతి): కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామపంచాయతీ వర్కర్ మారగాని పున్నయ్య సతీమణి మారగాని రేణుక(37) ఇటీవల మరణించగా వారికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం మాజీ జెడ్పిటిసి సభ్యుడు బండి వెంకటరెడ్డి, మిత్ర బృందం కలిసి పున్నయ్య కూతురు మోక్ష శ్రీ పేరిట 70 వేల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేసారు. ఆదివారం రేణుక దశదినకర్మల సందర్భంగా ఆ.. డిపాజిట్ బాండ్ ను మాజీ జెడ్పీటిసి బండి వెంకట్ రెడ్డి తన బృందంతో చిన్నారికి అందజేశారు.






