1 June, 2026 | 12:25 PM

Breaking News

డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చలో కలెక్టరేట్ పాదయాత్ర ప్రారంభం   •   ఉరుమడ్ల గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలు   •   అగ్నివీర్ కు ఎంపికైన అచ్చంపేట యువకుడు   •   World Milk Day: పాల ధర తగ్గి, ఖర్చులు పెరిగి డైరీ రైతులు నష్టాల్లో   •   ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •   సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్   •   రామేశ్వరం కోనేరులో పడి మహిళ మృతి   •   ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడిగా బిల్లకంటి హరిబాబు గెలుపు   •   సింగరేణిలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహణ   •  

పక్కాభవనాల నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం

09-04-2026 12:00 AM

సర్పంచ్ దున్నా శ్రీనివాస్

కోదాడ (నడిగూడెం)ఏప్రిల్ 7, ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాల నిర్మాణానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని  నడిగూడెం గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాస్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అద్దె భవనాల్లో  నిర్వహిస్తున్న ఎస్సీ బాలుర  హాస్టల్ కు పక్కా భవనము మంజూరు కావడంతో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో   మంగళవారం హాస్టల్ భవన నిర్మాణం కొరకు స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు  నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల  సహకారంతో గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన చోట పక్కాభవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు.వారి వెంట పాఠశాల  ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, జిపిఓ కోటయ్య,వార్డు సభ్యులు నాగవరపు సరస్వతి రాము ఉన్నారు.