ఇందిరమ్మ ఇండ్లు పేదోడి ఆత్మగౌరవానికి ప్రతీక
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
అడ్డాకుల, ఏప్రిల్ 3 : ఇందిరమ్మ ఇండ్లు పేదోడి ఆత్మగౌరానికి ప్రతీక అని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. అడ్డాకుల మండల పరిధిలోని పొన్నకల్, రాచాల, రెండు గ్రామాలలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను శుక్రవారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు సొంత ఇల్లు ఉండాలనేదే తెలంగాణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు
. అదేవిధంగా లబ్ధి పొందిన లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎంరేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డికి, డిప్యూటీ సీఎం, బట్టి విక్రమార్కకి, దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.




