29 April, 2026 | 3:26 AM

రైతాంగాన్ని కాంగ్రెస్ మోసం చేస్తుంది

29-04-2026 01:36 AM
  1. మే 6న రైతు డిక్లరేషన్‌పై వరంగల్‌లో బీఆర్‌ఎస్ సమావేశం
  2. హాజరుకానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందని బీఆర్‌ఎస్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతన్నలను మోసం చేసిన మే 6వ తేదీని పురస్కరించుకొని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేలా రైతన్నలతో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది.

ఈ రైతు వ్యతిరేక సమావేశానికి తాను హాజరవుతానని కేటీఆర్ తెలిపారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట నాలుగు సంవత్సరాల కిందట అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటి నా ఇప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తన మోసాన్ని కొనసాగిస్తున్న దని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువుల కొరత, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోళ్లలో తీవ్రమైన సంక్షేమం వంటి సమస్య లు తలెత్తుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగానికి బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పోరాటాలకు సిద్ధమవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చా రు. జిల్లాలో ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగక రైతన్నలు తీవ్రమైన ఇబ్బందు ల్లో ఉన్నారని పార్టీ నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.  

పార్టీ సభ్యత్వంపై ఫోకస్...

మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ నేతలు కేటీఆర్‌కు పలు వివరాలు అందజేశారు.