పోగొట్టుకున్న 11 ఫోన్లు అందజేత
29-04-2026 01:35 AM
పాపన్నపేట, ఏప్రిల్28: ఎక్కడైనా ఫోన్ పోగొట్టుకున్న, దొంగలించబడిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఇటీవల వివిధ ప్రాంతాలలో పోగొట్టుకున్న 11 సెల్ ఫోన్లు సీఈఐఆర్ వెబ్ సైట్ ద్వారా రికవరీ చేసినట్లు తెలిపారు. మంగళవారం ఠాణాలో వారికి ఫోన్లు అందజేశారు. సీఈఐఆర్ ద్వారా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ పరిధిలో 509 ఫోన్లు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది తదితరులున్నారు.






