20 April, 2026 | 1:43 AM

మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు

20-04-2026 12:00 AM

మోదీ ఎత్తుగడలను కాంగ్రెస్ చిత్త చేసింది                

నెగ్గితే బిజెపి ఖాతాలో... ఓడితే కాంగ్రెస్ ఖాతాకు నెట్టే యత్నం         

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ (131వ రాజ్యాంగ సవరణ) ముసుగులో దేశ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీయాలని చూసిన మోడీ, అమిత్ షా కుట్రలను రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పటాపంచలు చేశారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం  యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో ఆయన మాట్లాడారు.

పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడితే నెగ్గితే బిజెపి ఘనతగా, ఓడిపోతే ప్రతిపక్షాలపై రుద్దే కుట్ర పన్నిందన్నారు. ఇలాగే 2020లోనూ రైతులపై నల్ల చట్టాలు తెద్దామని కేంద్రం తీవ్రంగా శ్రమించిందని ప్రజల నుండి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో బిజెపి బొక్క బోర్ల పడిందన్నారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గ్రహించి దక్షిణాది రాష్ట్రాలను అప్రమత్తం చేశారని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడం జరిగిందన్నారు.

దక్షిణాది రాష్ట్రాలను తెలంగాణ రాష్ట్రం తరఫున, దక్షిణాది రాష్ట్రాల ఐక్యత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు న్న 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుంది. బిజెపి పార్టీ ప్రవేశపెట్టిన మూడు బిల్లులో మహిళా అంశం లేదని డీలిమిటేషన్ పేరుతో మళ్ళీ అధికారంలోకి రావడానికి బిజెపి ప్రయత్నం చేస్తుందన్నారు.

అందరినీ కలుపుకొని సోమవారం పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్య మంత్రులతో మాట్లాడి మహిళా బిల్లును పార్లమెంట్లో ఆమోదించేలా కృషి చేస్తారన్నారు.బిల్లు ఆమోదం పొందకపోయినా తమకు నష్టం లేదని చెప్పడం వారి అసలు ఉద్దేశాన్ని వెల్లడిస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలను బలహీనపరిచే ప్రయత్నాలను ప్రజలు గట్టిగా తిప్పికొడతారన్నారు. ఇండియా కూటమి దేశాన్ని రక్షించే శక్తిగా నిలుస్తోందని భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, చిన్న రాష్ట్రాల హక్కులను రక్షించడానికి ఇండియా కూట మి పోరాటం కొనసాగుతుందన్నరు. 

ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్,వైస్ చైర్మన్ బడిగె రమ్య,కౌన్సిలర్ పెలిమిల్లి లావణ్య శ్రీధర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.