20 April, 2026 | 1:44 AM

నేటి తరానికి స్ఫూర్తి.. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి

20-04-2026 12:00 AM

విశ్రాంత న్యాయమూర్తి కుకుడాల లక్ష్మణ్

చిట్యాల, ఏప్రిల్ 19 : స్వయంకృషి, పట్టుదలతో కష్టాలకు ఎదురీది ఉన్నత స్థానానికి ఎదిగి ఐఏఎస్ హోదా సాధించిన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి నేటి తరానికి స్ఫూర్తి అని విశ్రాంత న్యాయమూర్తి కుకుడాల లక్ష్మ ణ్ అన్నారు.

ఆదివారం చిట్యాల మండల కేంద్రంలో గల ముప్ప మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో ప్రముఖ సాహితీవేత్త మరియు తె లంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి ఐఏఎస్ హోదా పొందిన సందర్భంగా ప్రమోద సా హితీ,ఏనుగు నరసింహారెడ్డి మిత్ర బృందం ఆధ్వర్యంలో తెలంగాణ సాహితి జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షతన పౌర స న్మానం ఏర్పాటు చేశారు.

స్వయంకృషి, పట్టుదలతో కష్టాలకు ఎదురీది ఉన్నత స్థా నానికి ఎదిగి ఐఏఎస్ హోదా సాధించిన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి నేటి తరానికి స్ఫూర్తి అని విశ్రాంత న్యాయమూర్తి కుకుడాల లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా కుకు డాల లక్ష్మణ్ మాట్లాడుతూ నరసింహారెడ్డి చిన్నప్పటినుండే క్రమశిక్షణతో చదివి ఈ స్థాయికి ఎదగడం చిట్యాలకు గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏనుగు నర సింహారెడ్డి మాట్లాడుతూ తనకు ఏ రం గంలో అభిరుచి ఉంటుందో ఆ రంగంలోనే కృషి చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరవచ్చు అని అన్నారు.

తెలుగు భాష అంటే మక్కువ ఎక్కువ అని తెలుగుభాష తోటే చదివి ప్రస్తుతం ఉన్నత స్థానానికి చేరుకో గలిగినానని , చిట్యాల తనను తీర్చిదిద్దిందని చిట్యా లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలేశ్వరం శంకరం, తండు కృష్ణ కౌండిన్య, తాడూరి చంద్రం, పెరుమాళ్ళ ఆనంద్, ఏభూషి నరసింహ, డా. సాగర్ల సత్త య్య, సిలివేరు నరసింహ, శీలా సత్యనారాయణ, శివకోటి యాదగిరి, ఏనుగు నర్సిరెడ్డి, చెరుపల్లి రఘునాథం, నాంపల్లి శ్యామ్, ఇమ్మడి శ్రీనివాస్, పోకల స్వామి, సిలివేరు కృష్ణ, పి సుదర్శన్ రెడ్డి, రావుల నర్సిరెడ్డి, ఎండి గాలిబ్, సర్దార్ బహుదూర్ సింగ్, శివకోటి రమేష్, శీలా వెంకటేశ్వర్లు, మునిసిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్,  తదితరులు పాల్గొన్నారు.