09-02-2026 12:00:00 AM
బీజేపీ రాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ ఇంచార్జి అభయ్ పటేల్
మంచిర్యాల, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడి అవినీతికి అడ్డగా మారిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ ఇంచార్జి అభయ్ పటేల్ అన్నారు. ఆదివారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోనే కాకుండా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా అవినీతి అక్రమాలకు అడ్డగా మారి, గుండాయిజానికి అడ్డు అదుపు లేకుండా పోవడంతో ఇక్కడ ఎన్నో రకాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి వికసిత్ మంచిర్యాల బిజెపి సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, మాజీ ఎంపీ వెంకటేష్ నేత, జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, తుల ఆంజనేయులు, అమీర్ శెట్టి రాజు, రంగ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.