15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

29-12-2025 01:08 AM

నార్సింగి(చేగుంట), డిసెంబర్ 28 : అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని నార్సింగి ఉప సర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్బిఐ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మెదక్ ఇంచార్జి మైనంపల్లి హనుమంత్ రావు ఆదేశానుసారం మండలంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, పార్టీ నాయకుల సమక్షంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంకాపూర్ సర్పంచ్ పార్శా సంతోష్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, మండల మత్స్యశాఖ అధ్యక్షుడు సుధాకర్, పార్టీ నాయకులు రాజేశ్వర్ గౌడ్, చాంద్ పాషా, చందూ యాదవ్, రుక్ముద్దీన్, జహీర్, రాజేష్, వార్డు సభ్యులు ఆటో జానీ, బాచి స్వామి, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్, చిన్న కృష్ణ గౌడ్, శ్రీరామ్ భరత్, ఇండ్ల వెంకటేశం, మోతి లాల్, తదితరులు పాల్గొన్నారు.