calender_icon.png 2 January, 2026 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి..

29-12-2025 01:07:10 AM

తూప్రాన్, డిసెంబర్ 28 :తూప్రాన్ మండలం వెంకట రత్నాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ వార్డు సభ్యురాలు రుద్రారం రేఖ బిఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి బూరుగుపల్లి ప్రతాపరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈమెతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు సీత శ్రీకాంత్, సీత బన్నీ, బి.మహేష్, కె.యాదయ్య, కె.మహేష్, కె.రాములు, ఎస్.మహేష్ బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. నాయకులు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు జరిగి నెల రోజులు కాకముందే బిఆర్‌ఎస్ లో చేరడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో వెంకటరత్నపూర్ సర్పంచ్ కిచ్చిగారి భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ సీత మహేష్ యాదవ్, వీరితో పాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.