1 May, 2026 | 3:20 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి

01-05-2026 01:57 AM

రాజాపూర్ ఏప్రిల్ 30: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని హౌసింగ్ పిడి వెంకట ఉపేందర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆత్మగౌరవం కోసం ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణం చేపట్టిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పనుల మొదలు పెట్టిన వారికి విడతల వారిగా వెంటనే బిల్లులు కోసం లబ్ధిదారుల ఖాతాల నగాదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ అధికారులు పాల్గొన్నారు.