అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి
శ్రీరంగాపూర్ ప్రెస్ క్లబ్ డిమాండ్
శ్రీరంగాపూర్, ఏప్రిల్ 30: వనపర్తి జిల్లాలోని వివిధ మండలాలలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని శ్రీరంగాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాలరాజు ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులు ప్రజలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు మధ్య వారధిగా నిలిచి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తు ప్రజలకు కాంతిని అందిస్తున్న పాత్రికేయులను అక్రిడేషన్ కార్డు ఇవ్వకుండా ఇష్టానుసారంగా జిల్లాస్థాయి వారికి మాత్రమే ఇవ్వడం కరెక్ట్ కాదని హెచ్చరించారు.
అయితే జిల్లాలో కొందరికి మాత్రమే అక్రిడేషన్ కార్డులు పరిమితం చేసి, మండల స్థాయిలో ఉన్న గ్రామీణ ప్రాంత పాత్రికేయులకు ఇవ్వకుండా రెండవ విడతలో ఇస్తామని నమ్మించడం సరైంది కాదని విమర్శించారు. ఇది గ్రామీణ జర్నలిస్టులకు నష్టం కలిగించే చర్యగా పేర్కొన్నారు.
జీతభత్యాలు సరిగా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలను గుర్తించి, వారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అక్రిడేషన్ కార్డులను అర్హులైన అందరికీ ఇవ్వాలని శ్రీరంగాపూర్ ప్రెస్ క్లబ్ బాలరాజ్, కమిటీ సభ్యులుకోరారు.ఒకవేళ అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోతే, అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు.






