07-02-2026 12:00:00 AM
కలెక్టర్ కే హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 6(విజయ క్రాంతి): నిరుపేదలకు గూడు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రకాష్ రావుతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
మొదటి విడతలో 9,057 ఇండ్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 7,757 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇంకా ప్రారంభం కాని 1,300 ఇండ్లకు సంబంధించి కారణాలు తెలుసుకొని మార్చి 31లోపు పనులు మొదలు పెట్టని ఇండ్లను రద్దు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నందున లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.
ఆధార్, సాంకేతిక సమస్యలు, అటవీ సంబంధిత సమస్యలు ఉంటే తక్షణమే జిల్లా దృష్టికి తీసుకురావాలని ఆదేశిం చారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జనకాపూర్లో ఉన్న మండల సమైఖ్య భవనంలో కొనసాగుతున్న ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ కేం ద్రం ద్వారా జిల్లాలోని అం గన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు 24,765 జతల ఏకరూప దుస్తులు కుట్టి అందిస్తున్నట్లు తెలిపారు.
నాణ్యమైన దుస్తులను నిర్ణీత గడువులోగా అందించాలని సూచించారు. ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు జరిగే ఇంటర్ వార్షిక పరీక్షల కోసం జిల్లాలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 9,716 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పోలీ సు బందోబస్తుతో భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశిం చారు. ఈ కార్యక్రమాల్లో మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.