calender_icon.png 7 February, 2026 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ పీఠం.. దక్కేది ఎవరికి?

07-02-2026 12:00:00 AM

  1. పకడ్బందీ ప్రచారంతో ముందుకు వెళుతున్న నేతలు 

అంతు చిక్కని ఓటరు అంతరంగం 

నిర్మల్ ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో మున్సిపల్ పీఠంపై ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు గడుగు మరో ఐదు రోజులు మాత్రమే ఉండడంతో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలైన బీజేపీ బీఆర్‌ఎస్ ఎంఐఎం పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో అగ్ర నేతలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా పార్టీ అగ్రనేతలు పట్టణంలోని 42 వార్డుల లకు ఇన్చార్జిల్ గా నియమించి రోజువారి రాజకీయ సమీకరణాలను వేస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి మాజీ మంత్రి ఇంద్రకన్ రెడ్డి మాజీ డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావు మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి వార్డు లుగా విభజించుకుని ప్రచారం చేస్తున్నారు.

ఇక బిజెపిలో అన్ని తానై స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రోడ్ షోలు ఇంటింటి ప్రచా రం చేరికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భారత రాష్ట్ర సమితి జిల్లా ఇంచార్జ్ అనిల్ జాదవ్ సీనియర్ నేతలు రామ్ కిషన్ రెడ్డ మార్గొండ రాము వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. ఎంఐ ఎం పార్టీ తరఫున ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు 

పగలు ప్రచారం రాత్రి రాయబారం 

ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్నంతో ఆయా వార్డులో పార్టీ నేత లు అభ్యర్థులు పగలు ప్రచారం చేసి రాత్రి ఓటర్లు స్థానిక లీడర్లతో రాయబేరాలు సాగిస్తున్నారు. కులాల వారిగా సమీకరణలు చేసుకొని కుల సంఘాలను తమ బుట్టలు వేసుకునేందుకు ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. అయితే ఓటర్లు మాత్రం ఏ పార్టీ లీడర్లు వచ్చిన మీకే ఓటు అంటూ అందరికీ జై అనడంతో ఓటరు అంతరంగం ఎవరికి అంతుచికడం లేదు.

ఆయా వార్డులో గ్రూపులుగా విభజించి 50 మందికి ఒక ఇన్చార్జి నియమించి వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కాలనీలో ప్రతిరోజు కిలో మటన్ కిలో చికెన్ పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఉద్దేశంతో డబ్బు పంపిణీకి మద్యం పంపిణీ పార్టీ అభ్యర్థులు ఔషధ ఏర్పాట్లు చేసుకుంటున్నారు