10 June, 2026 | 3:29 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

07-02-2026 12:00 AM

జిల్లా ఎన్నికల అధికారి కుమార్ దీపక్ 

నస్పూర్, ఫిబ్రవరి 6 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిబ్బందిరాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు కె గంగాధర్, జిల్లా విద్యాధికారి యాదయ్యలతో కలిసి మున్సిపల్ ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఒక బృందానికి ఒక పి.ఓ., ఒక ఎ.పి.ఓ., ముగ్గురు ఓ.పి.ఓ. ల చొప్పున బెల్లంపల్లి మున్సిపాలిటీకి 68బృందాలు, చెన్నూరు మున్సిపాలిటీకి 36బృందాలు, క్యాతనపల్లి మున్సిపాలిటీకి 45బృందాలు, లక్షెట్టిపేట మున్సిపాలిటీకి 30బృందాలు, మంచిర్యాల నగరపాలక సంస్థకు 265 బృందాలు రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు.

ఎన్నికల సిబ్బంది వారికి కేటాయిం చిన స్థానాలలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా సమన్వయంతో చర్యలు తీసుకో వాలని సూచించారు. ఎన్నికల విధులు కేటాయించబడిన సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో కలెక్టరేట్‌పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.