12-11-2025 12:00:00 AM
నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
కల్వకుర్తి నవంబర్ 11: పత్తి మిల్లులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు సాగేలా చూడాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. కల్వకుర్తి మండల పరిధిలోని తర్నికల్ గ్రామ శివారులో ఉన్న బాలాజీ జిన్నింగ్ మిల్లును మంగళవారం సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. పత్తి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగవద్దన్నారు.
అకాల వర్షాల వలన ప్రస్తుత పత్తి కొను గోలు సీజన్కు సంబంధించిన ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని, రైతులకు సరైన మద్దతు ధర (ఎంఎస్పి) చెల్లింపులో పారదర్శకత ఉండాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తగిన సౌకర్యాలు కల్పించడంతో పాటు తూకం, చెల్లింపు ప్రక్రియలను సక్రమంగా నిర్వహించాలన్నారు. మద్దతు ధరలకు పత్తి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు అన్ని సదుపాయాలు అందే లా చూడాలన్నారు.
సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, సంబంధిత అధికా రులు పరస్పర సమన్వయంతో పనిచేసి పత్తి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, పారదర్శకంగా, వేగంగా కొనుగోలు ప్రక్రియ సాగేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులకు సూచించారు.
సీసీఐ అధికారులు మిల్లుల యజమానులు రైతులకు తగిన మద్దతు ధర చెల్లించడం, తేమ శాతం పరిశీలనలో నిబంధనలు పాటించడం, బరువు తూకం పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాల న్నారు. కల్వకుర్తి తహసిల్దార్ ఇబ్రహీం, జిన్నింగ్ మిల్లు అధికారులు తదితరులు ఉన్నారు.
క్రీడల ద్వారా ఆరోగ్యం
కల్వకుర్తి టౌన్, నవంబర్ 11: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి విజయానికి నాంది అని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. కల్వకుర్తి గిరిజన గురుకుల పాఠశాలలో 6వ గిరిజన జోనల్ స్థాయి క్రీడలను ప్రారంభించిన ఆయన, క్రీడల ద్వారా శారీరకమానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. క్రమశిక్షణ, విలువలు పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడలను జీవితంలో భాగంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు.