calender_icon.png 12 November, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదులు రక్షణ చట్టం తేవాలి

12-11-2025 12:00:00 AM

పేటలో న్యాయవాదుల గేట్ ధర్నా

నారాయణపేట టౌన్, నవంబర్ 11(విజయక్రాంతి) : న్యాయవాదుల సంరక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నారాయణపేట జిల్లా కోర్టు ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గేట్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం కోసం అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు న్యాయవాదులు చేపట్టే పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

12న బుధవారం న్యాయవాదులు అందరూ జిల్లా కోర్టు సముదాయంలో అన్ని కోర్టుల విధులను బహిష్కరించి పాదయాత్రలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్,ఉపాధ్యక్షుడు నందు నామాజీ, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, న్యాయవాదులు, రఘువీర్ యాదవ్, సీతారామారావు, మల్లికార్జున్, ఆకుల బాలప్ప,నారాయణ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.