10 May, 2026 | 2:37 AM

దేశాన్ని శ్రేష్ఠ్ భారత్‌గా మార్చాలి

27-01-2025 01:15 AM

* దేశ సంస్కృతిని కాపాడేలా భారతమాత మహా హారతి

* గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (విజయక్రాంతి): భారత మాత స్ఫూర్తి తో ఐక్యంగా ముందుకు సాగాలని, దేశాన్ని శ్రేష్ఠ్ భారత్‌గా మార్చాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పిలుపునిచ్చారు. భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్, నెక్లెస్‌రోడ్ వద్ద ఆదివారం నిర్వహించిన భార తమాత మహా హారతి కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొ న్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడుతూ.. దేశ సంస్కృతిని కాపాడేలా ఈ కార్యక్రమం నిర్వహించ డం అభినందనీయమన్నారు. భారతమాత ఓ కార్యక్రమం కాదని, ఉద్యమమని పేర్కొన్నారు. 

అంబేడ్కర్ స్ఫూర్తితో సంక్షేమ పథకాలు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

అంబేడ్కర్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అంబేడ్కర్ భావాలను ముందుకు తీ సుకెళ్తున్నామని చెప్పారు. పదేండ్లలో దేశ సంస్కతి సంప్రదాయాలను కాపా డేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నా రు.

కార్యక్రమంలో మాడ్గుల నాగఫణిశర్మ, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పా యల్ శంకర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, మాజీ ఎంపీలు బీబీ పా టిల్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, ఐఏఎస్ శిక్షకురాలు బాలలత, భారత మాత ఫౌండేషన్ ప్రతినిధులు  పాల్గొన్నారు.