6 June, 2026 | 2:47 AM

జూలై 31 లోగా కోర్టును చక్కదిద్దాలి

06-06-2026 12:37 AM

జిల్లా న్యాయమూర్తి  నీలిమ

తూప్రాన్, జూన్ 5 : గత కొంతకాలంగా తూప్రాన్ పట్టణంలో కోర్టు భవన సముదాయం కొరకు వివిధ ప్రభుత్వ భవనాలను పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తూప్రాన్ లోని పాత ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా న్యాయమూర్తి నీలిమ తో పాటు అదనపు న్యాయమూర్తి సంతోష్ కుమార్ కలిసి పాత ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. పాత ఎంపీడీవో కార్యాలయం అనుకూలంగా ఉండడంతో కోర్టు భవనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

జూలై 31 లోపు కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు 30 లక్షల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు కాంట్రాక్టర్ కు అన్ని మౌలిక వసతులతో కోర్టు భవన సముదాయాన్ని చక్కగా తీర్చిదిద్దాలని వారు ఆదేశించారు.

అనంతరం పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా వారి చేతుల మీదుగా మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటూ మొక్కలు నాటాలని ఆమె సూచించారు. ఇందులో ఆర్డిఓ జయచంద్ర రెడ్డి, డీఎస్పీ నరేందర్ గౌడ్, ఎంపీడీవో సతీష్, ఎమ్మార్వో చంద్రశేఖర్ రెడ్డి, బోర్డు అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, న్యాయవాదులు బొడ్డు శ్రీనివాస్, ఎం అశోక్, వేణుగోపాల చారి, శివకుమార్, శ్రీపతిరావు, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ పోలీసు న్యాయశాఖ అధికారులు తదితరులు ఉన్నారు.