దండం సారూ.. పరిహారం ఇవ్వండి!
సీఎం రేవంత్‌రెడ్డికి గిరిజన రైతుల వినతి
కొల్లాపూర్ రూరల్, జూన్ 5: పాలమూరు--రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి నార్లాపూర్--అంజనగిరి రిజర్వాయర్ నిర్వాసిత గిరిజన రైతులు దండంపెట్టి పరిహారం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం వినతిపత్రం అందజేశారు. నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద సీఎంను కలిసిన గిరిజన మహిళా రైతులు, మాజీ జడ్పీటీసీ హనుమంత్ నాయక్ ఆధ్వర్యంలో తమ సమస్యలను వివరించారు.
ప్రాజెక్టు పనులు ప్రారంభమై దాదాపు పదేళ్లు గడిచినా వెనుకబడిన వర్గాల రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదన్నారు. ఎల్లూరు పరిధిలో 32 ఎకరాల భూమిని ప్రాజెక్టుకు అవసరం లేకపోయినా రైతులను పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి బలవంతంగా స్వాధీ నం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించడంతో పాటు పెండింగ్ పరిహారం చెల్లించాలని సీఎంను కోరారు.






