6 June, 2026 | 2:36 AM

రిటైర్మెంట్ వయస్సు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలి

06-06-2026 12:37 AM

ప్రభుత్వ వైద్యుల సంఘం

నల్లగొండ టౌన్, జూన్ 5: పదవి విరమణ వయసు పెంపకం ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ వైద్యుల హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని ప్రభుత్వ వైద్యుల సంఘం కోరింది. ప్రభుత్వ వైద్యుల సంఘం సెంట్రల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్వహించిన నిరసన వ్యక్తం చేశారు.

ప్రాథమిక సభ్యులందరూ పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సంఘం కోరింది. ప్రస్తుతం బదిలీ ప్రక్రియ జీవో నెం.38 ప్రకారం అమలు కావాల్సి ఉన్నప్పటికీ, కొందరు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా అది సక్రమంగా అమలు కావడం లేదని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

జీవో ప్రకారం పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు? నిరసన కార్యక్రమంలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, టీఎన్జీవో సంఘం సభ్యులు పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయాలని కోరారు. వైద్యుల హక్కులు, సేవా నిబంధనల పరిరక్షణ కోసం అవసరమైతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని సంఘం హెచ్చరించింది.