15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పేదలకు సొంతింటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

12-06-2025 12:55 AM

ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి

వనపర్తి టౌన్ జూన్ 11:ఇళ్లు లేని నిరుపేదలకు అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే ఇందిరమ్మ ఇళ్లు మం జూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు.బుధవారం ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి  వనపర్తి శాసన సభ్యులు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి హాజరయ్యారు.

వనపర్తి నియోజక వర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లకు గాను మొదటి దశలో 770 ఇళ్ళు మంజూరు చేయగా రెండవ దశలో 2730 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి బుధవారం మంజూరు పత్రాల పంపిణీ చేశారు. మొదటి, రెండవ దశలో మంజూరు చేసిన ఇళ్లను కలుపుకొని ఘనపూర్ మండలానికి 402, గోపాల్పేట 419, పెబ్బేరు 355, పెబ్బేరు మున్సిపాలిటీకి 143, పెద్దమందడి 376, రేవల్లి 205, ఎదుల 162, శ్రీరంగాపూర్ 266, వనపర్తి మండలానికి 453, వనపర్తి మున్సిపాలిటీకి 575, ముసాపేట 14, అడ్డకుల 60  వెరసి 3430  ఇళ్లను జిల్లా కలెక్టర్ ద్వారా ఆమోదం పొంది మంజూరు పత్రాలు జారీ చేయడం జరిగింది.

మరో 70 లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంది.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన సభ్యులు మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం, పట్టణం లేదని  చెప్పారు. ఒక్కొ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున 350 0 ఇండ్లకు రూ.175 కోట్లు కేవలం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం వెచ్చిస్తున్నామని తెలిపారు. ఈ రోజు రూ.50 కోట్ల విలువగల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పంపిణీ చేస్తున్నామన్నారు.ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్టాలు స్వీకరించిన లబ్ధిదారులు 45 రోజులలో ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టాలని సూచించారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప త్రాలను పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటి కల సార్ధకమవుతున్నందుకు హర్షం వ్యక్తం చే శారు. 

వనపర్తి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల మంజురుకు గాను ఎమ్మెల్యే మేఘా రెడ్డి చొరవతో అదనంగా 600 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. వనపర్తి మున్సిపాలిటీ, మండలంలో 1028 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు తీసుకున్న లబ్ధిదారులు వనపర్తి జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో నిర్మించిన  మోడల్ ఇంటిని పరిశీలించాలని,400-600 చదరపు అడుగుల విస్తీర్ణం లో  ఇండ్ల నిర్మాణం చేసుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య,  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ ప్రసాద్, హౌసింగ్ డి. ఈ విటోభా, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.