న్యాయవాది హత్య కేసులో దుండగులను కఠినంగా శిక్షించాలి
తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి
ముషీరాబాద్, మే 23 (విజయక్రాంతి): సీనియర్ న్యాయవాది ఖాజా మోహినోద్దీన్ మృతికి కారకులైన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం తన ఇంటి నుంచి బయటకి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. ఆయన మృతికి కారకులైన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. మొయినొద్దీన్ మృతి న్యాయవాద వృత్తికి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
తెలంగాణ వైతాళికుల విగ్రహాలను ఏర్పాటు చేయాలి..
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని మైత్రివనంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 28న ఆవిష్కరిస్తుందని, ఇదే క్రమంలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని వైతాళికుల విగ్రహాలను ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుందని తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు.






