19 June, 2026 | 3:28 AM

అశ్విన్‌రావు మరణం బాధాకరం

19-06-2026 01:56 AM

బీఆర్‌ఎస్ అగ్రనేతలు: కేటీఆర్, హరీష్ రావు

సిరిసిల్ల, జూన్ 18 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కుమారుడు చిక్కాల అశ్విన్‌రావు దశదినకర్మ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విన్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

అనంతరం చిక్కాల రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని చిక్కాల అశ్విన్‌రావుకు నివాళులర్పించారు.