19 June, 2026 | 3:20 AM

పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం

19-06-2026 01:55 AM

అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ కంఠం శిరీష

మేడ్చల్, జూన్ 18 (విజయక్రాంతి): మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మజీద్ పూర్ గ్రామంలో అబ్బాగౌని సంగీత -రవి గౌడ్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంత ఇళ్ల కలను నెరవేర్చుకుంటున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి ప నిచేస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తునికి రమేష్, అలియాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు సరసం వనజ అశోక్ రెడ్డి, సామల జశ్వంత్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ తుంకి బిక్షపతి, మాజీ సర్పంచ్ అబ్బాగౌని రాములు గౌడ్, ఏళ్ళ మల్లేష్, మున్సిపల్ బీసీ సెల్ అధ్యక్షులు గిర్మాపూర్ నర్సింగ రావు గౌడ్, 10వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్బాగౌని సురేష్ గౌడ్, సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, శ్రీశైలం గౌడ్, శ్యామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.