15 May, 2026 | 6:08 AM

విద్యార్థుల బలవన్మరణం బాధాకరం

26-04-2024 12:05 AM

టీనేజ్ యువత పరీక్షలు తప్పితే ప్రాణాలు తీసుకోవాలా? పరీక్షల్లో పాస్ కాకపోవడానికి పలు కారణాలు వుంటాయి. వాటిని పరిష్కరించుకొని వచ్చేసారి మరింత గట్టి ప్రయత్నం చేయాలి. అంతేకానీ, బలవన్మరణాలకు పాల్పడటం వల్ల తల్లిదండ్రులకు తీరని శోకమే మిగులుతుంది. ఇంటర్‌లో ఉత్తీర్ణత పొందలేక పోయామన్న కారణంతో తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో మొత్తం ఏడుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం అత్యంత బాధాకరం. 

                                          సాత్విక్‌శర్మ, వేములవాడ