27 March, 2026 | 3:53 AM

అద్దె గదులు.. అద్దెకిచ్చారు

27-03-2026 01:30 AM

మార్కెట్ యార్డ్ లో అడితి వ్యాపారుల మాయాజాలం 

రైతుల శ్రేయస్సు కోసం గదుల నిర్మాణం 

బయట వ్యాపారులకు అద్దెకిచ్చిన అడితి వ్యాపారులు 

నిలువ నిడలేక ఇబ్బందులు పడుతున్న రైతులు

మెట్ పల్లి, మార్చి 26(విజయక్రాంతి): మెట్ పల్లి మార్కెట్ యార్డ్ లో సుమారు పది సంవత్సరాల క్రితం రైతుల శ్రేయస్సు దృష్ట్యా నిర్మాణం చేపట్టిన గదులు నేడు అడితి వ్యాపారుల మాయాజాలంతో రైతన్న వసతులు కరువై తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధన్యాన్ని రైతులు అమ్మకాల కోసం రోజుల తరబడి మార్కెట్ యార్డులో పడిగాపులు ప డుతున్న వెతలు అప్పటి ప్రభుత్వం గుర్తించింది. దింతో వారి సౌకర్యం కోసం మార్కె ట్ యార్డ్ స్థలంలో గదుల నిర్మాణానికి ఏ ర్పాట్లు చేసింది. కాని ఆ గదులు నేడు రైతన్నకు పనికి రాకుండా పోవడంతో మెట్ పల్లి మార్కెట్ యార్డ్ లో రైతుల బాధలు వినేనాధుడు కరువాయ్యడు.

వివరాల్లోకి వెళ్తే మెట్ పల్లి మార్కెట్ యార్డ్ కు ప్రతి ఏడు పసుపు,మొక్కజొన్న లతో పాటు వడ్లు కూ డా పెద్ద ఎత్తున తరలి వస్తుంటాయి. మా ర్కెట్ యార్డ్ లో పెద్ద ఎత్తున పంట దిగుబడులు తరలి రావడంతో రైతులు ధాన్యం కు ప్పలపై రాత్రుళ్లు పడుకోవడం జరుగుతుంది. దింతో పంట పొలాల నుండి ధ్యానంతో పాటు అప్పుడపుడు విష కిటకాలు కూడా రా వడం, వాటితో పలు మార్లు రైతులకు ప్రమాదాలు సంభవించడం జరిగింది. విష యం గ్రహించిన అప్పటి ప్రభుత్వం రైతుల విశ్రాంతి కోసం ప్రత్యేక గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

గదులతో రైతులకు వసతుల ఏర్పాటు

పసుపు, మొక్కజొన్న, వరి పంటలకు సంబందించిన ధాన్యం మార్కెట్ యార్డ్ కు తెచ్చే రైతులు తమ పంటలు అమ్మకాలు జరి గే వరకు తమ పంటను అమ్మే అడితి వ్యాపారికి కేటాయించిన గదిలో విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆయా రైతులకు అడితి వ్యాపారులు మంచి నీరు,పడుకోవ డం కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దింతో రైతు రాత్రి ఆ గదుల్లో విశ్రాంతి తీసుకోని తెల్లారి తమ పంటలను అమ్మకాలు చే యాల్సి ఉంది. అలాగే తమ పంటల అమ్మకాల అనంతరం అడితి వ్యాపారి నుండి రైతులు పట్టీలి కూడ ఈ గదులలోనే రాసి ఇవ్వాల్సి ఉంటుంది.

చక్రం తిప్పిన అడితి వ్యాపారులు

గదుల నిర్మాణం విషయం తెలుసుకున్న అడితి వ్యాపారులు ఆ గదులు తమకు కేటాయించాలని, ఏళ్లుగా మార్కెట్ యార్డ్ లో వ్యాపారం చేస్తూ మార్కెట్ కు ఎంతో లాభా లు చేకూర్చాము, తాము ధాన్యం కొనుగోలు చేసే రైతులకు వారి ధాన్యం అమ్మకాలు జరిగే వరకు తాము వసతులు కల్పిస్తామని అని పాలక వర్గానికి తెలిపారు. దింతో గదుల నిర్మాణం కోసం డిపాజిట్ తో పాటు నామ మాత్రపు అద్దె తో వారికి గదులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

మార్కెట్ కు చెల్లించేది నామ మాత్రం.. వసూల్ చేసేది భారీగా

జాతీయ రహదారి పక్కన నిర్మాణం జరిగిన ఈ గదులకు అడితి దారులు ఒక్కొక్క గదికి రెండు లక్షలు డిపాజిట్ చేయగా వారి కి సుమారు నెలకు మూడు వెల పైన అద్దె చెల్లించేలా ఒప్పందం తో వారికి గదులు అప్పగించడం జరిగింది. కాని గదులు తమ చేతికి రాగానే అడితి వ్యాపారులు రైతుల వసతుల మాట మరిచి వాటిని వేరే వ్యాపారులకు అద్దెలకు ఇచ్చుకున్నారు. ఇతర వ్యా పారాల కోసం వేరే వారికి ఒక్కో గదికి సు మారు ఐదు లక్షల అడ్వాన్స్ సుమారు పది నుండి పదిహేను వెల కిరాయి వసూలు చేస్తున్నారు. సీజన్ లో ధాన్యం మార్కెట్ యార్డ్ కు తెచ్చిన రైతులు మార్కెట్ యార్డ్ లోనే నిద్ర పోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆయా గదులను మార్కెట్ అధికారులకు లేదా రైతు సంఘాలకు అప్పగించాలని రైతులు కోరుతున్నారు.