calender_icon.png 13 October, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ రక్షకులు స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు

13-10-2025 12:00:00 AM

  1. ఆరు జిల్లాల సహాయ వ్యవస్థాపకులు మురళి 

మంథనిలో ఘనంగా ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు

మంథని అక్టోబర్ 12 (విజయ క్రాంతి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు దేశ రక్షణ పట్ల, సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్ర బిందువుగా అచంచల దీక్షతో ముందుకు వెలుతున్నా రని ఆర్‌ఎస్‌ఎస్ ఆరు జిల్లాల సహాయ వ్యవస్థాపకులు దావునూరి మురళి అన్నారు. ఆదివారం మంథని గాంధీ చౌక్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ దేశమంటే మను షులే కాదు దేశమంటే మట్టి అని సంఘ్ భావిస్తుందని ఆయన పేర్కొన్నారు.

100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ దినదినం అభిప్రాయంతో దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా పూర్తిగా విస్తరించిందని ఆయన గుర్తు చేశారు. బౌద్ధిక్ ప్రముఖ్ లక్కిరెడ్డి అన్వేష్, ధర్మ జాగరణ సేవా ప్రముఖులు మారుపాక నాగన్న కనుకుంట్ల స్వామి, పెద్దపల్లి వ్యవస్థాపకులు మాడిశెట్టి సుదర్శన్, సురేందర్, కొండపాక సత్య ప్రకాష్ పాల్గొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ కవాతులో బండి సంజయ్

కరీంనగర్ క్రైం, అక్టోబర్12 (విజయక్రాంతి): కరీంనగర్ లో రాష్ట్రీయ సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా  కరీంనగర్  స్వయం సేవకులు ఆదివారం రోజున భారీ కవాతు  ప్రదర్శన చేపట్టారు. శాతవాహన యూనివర్సిటీ రోడ్ లోని వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల నుండి కరీంనగర్ పట్టణంలో పలు ప్రాంతాల మీదుగా రాంనగర్ వరకు రూట్ మార్చ్ ( పథ సంచలన్) కార్యక్రమం కొనసాగింది. అనంతరం  శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మైదానంలో సంచలన్  సమరోప్  (ముగింపు సమా వేశం) జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య వక్త గా విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి అ య చితుల  లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ కవాతు సందర్భంగా అందరి ద్రుష్టి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పైనే పడింది. రాష్ట్రీయ స్వయం సేవక్ డ్రెస్ ధరించి ఈ కవాతులో పాల్గొన్నారు.  చైతన్య కాలేజీ వరకు కవాతు చేశారు.  కరీంనగర్ రాంనగర్ సత్యనారాయణ స్వామి టెంపుల్ వద్దకు వచ్చిన కేంద్ర మంత్రి ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్ లో పాల్గొన్నారు.

మరోవైపు పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు, స్థానిక ప్రజలు సైతం ఆర్‌ఎస్‌ఎస్ కవాతును ఆసక్తిగా తిలకించడంతోపాటు కవాతుపై పూల వర్షం కురిపిస్తూ తమ మద్దతును తెలియజేశారు. బండి సంజయ్ తోపాటు ఆయన కుమారుడు బండి సాయి సుముఖ్ సైతం ఆర్‌ఎస్‌ఎస్ కవాతులో పాల్గొని అందరి ద్రుష్టిని ఆకర్షించారు. .