సీఈఓ మామిడాల అశోక్ కుమార్ మృతి సహకార రంగానికి తీరని లోటు
అశోక్ కుమార్ చిత్రపటం వద్ద నివాళర్పించిన చైర్మన్, పాలకవర్గ సభ్యులు, పలువురు ప్రముఖులు, మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని, జూలై 9 (విజయక్రాంతి): మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శిగా విశిష్ట సేవలందించిన కీ.శే. మామిడాల అశోక్ కుమార్ మృతి సహకార రంగానికి తీరని లోటని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. గురువారం మంథనిలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, అశోక్ కుమార్ రైతుల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసి అందరి అభిమానాన్ని చురగొన్నారని పేర్కొన్నారు.
17 సంవత్సరాలుగా సహకార సంఘం లో విధులు నిర్వ్హహిస్తున్నాడని, సంఘ కార్యదర్శిగా ఈ ప్రాంత రైతాంగానికి ఎన్నో సేవలు అందిoచారని అన్నారు. అశోక్ కుమార్ సౌమ్యుడు, మంచి ఆలోచనాపరుడు, ఓర్పుమంతుడని, ఉద్యోగ నిర్వహణలో అశోక్ అకాల మరణం చెందడం బాదాకరమని అన్నారు. ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు ల సహాయ సహకారాలతో అశోక్ కుమార్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని అన్నారు. అశోక్ కుమార్ కుటుంబం ఈ భాదను తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్ధించారు.
మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ అశోక్ కుమార్ ఆకస్మిక మృతి ఈ ప్రాంత రైతులకు తీరని లోటని, తమ పార్టీ ద్వారా అశోక్ కుటుంబానికి అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. టీజీఈఅర్సి సలహాదారు శశిభూషణ్ కాచే మాట్లాడుతూ అశోక్ కుమార్ గుండె పోటుతో మరణించడం బాధాకరమని అన్నారు. సంఘాన్ని ఆర్థికంగా పరిపుష్టి సాధింప చేయడంలో అశోక్ కృషి ఎనలేనిదని అన్నారు. ఏ ఉద్యోగి అయిన విధి నిర్వహణలో ఒత్తిడిని జయించాలని, ఉద్యోగంలోని సమస్య్యలను వ్యక్తిగత సమస్యగా భావిoచరాదని అన్నారు.
సభలో పాల్గొన్న సంఘ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతులు, పలువురు నాయకులు అశోక్ కుమార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ భగవంతుడు వారికి ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్లు ఆకుల రాజబాపు, రావికంటి సతీష్ కుమార్, లెక్కల కిషన్ రెడ్డి, ఉడుత మాధవి- పర్వతాల్ యాదవ్, దాసరి లక్ష్మి-మొండయ్య, మున్సిపల్ కౌన్సిలర్ ఎల్లంకి వంశీధర్, కెడిసిసి బ్యాంక్ మేనేజర్ కె.ఉదయశ్రీ, డిఈ సందేబోయిన శ్రీనివాస్, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఎక్కటి అనంత రెడ్డి, నాయకులు గడ్డం పోషం, వేల్పుల గట్టయ్య, సంఘ సిబ్బంది దుబ్బాక సదాశివ్, బెజ్జంకి సదానంద్, నారమల్ల విద్యాసాగర్, బొద్దుల సమ్మయ్య, కొత్త స్వప్న, పైడాకుల రాకేశ్, గుడెల్లి మధుమోహన్, నారమల్ల చిన్నయ్య, మోతుకూరి సాగర్, రాగం అశోక్, పలువురు నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.






